కొందరు కూర్చుంటే కాళ్ళు ఊపుతుంటారు. అలా ఊపితే తప్పు అంటుంటారు పెద్దవాళ్లు. కానీ పరిశోధనలు ఇది చాలా మంచి అలవాటు అంటోంది. ఆ కాళ్ళుపే అలవాటు ఉంటే నాడీ సంబంధమైన వ్యాధులు దగ్గరకు రావని చెపుతున్నారు. ఇలా కాళ్ళు ,చేతులు అస్తమానం కదుపుతూ ఉంటే ధమనుల్లో రక్త ప్రసరణ మెరుగు పడుతుందని,శరీరానికి కావాలసిన వ్యాయామం అందుతుందని ,ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు రావని అంటున్నారు .ఒక సంవత్సరం పాటు అంచెలంచెలుగా కొన్ని గ్రూపులపైన ఈ అధ్యయనం నిర్వహించారు. ఏ మాత్రం వ్యాయామం లేకపోయినా ఈ కాళ్ళు ఊపే వారిలో ఏ అనారోగ్య లక్షణాలు కలనించలేదు. కాళ్ళు చేతుల్లో రక్త ప్రసరణ సవ్యంగా జరుగుతోందని కనిపెట్టారు.

Leave a comment