కొందరిలో ఎన్నో కారణాలతో కాలేయ కణాల్లో కొవ్వు పేరుకుకొని కాలేయం పాడైపోతుంది. ఆహారపు అలవాట్లు మార్చుకోవటం, వ్యాయామం చేయటం తప్ప ఇంకో చికిత్సా విధానం ఏదీ లేదు. అయితే స్వీడన్ కు చెందిన పరిశోధకులు ఆకుకూరల్లో లభ్యం అయ్యే అకర్బన్ నైట్రిట్ కి కాలేయంలో చేరిన కొవ్వుని తగ్గించే గుణం ఉందని తేల్చారు. ఈ దిశగా సాగిన పరిశోనల్లో ఈ నైట్రిట్ ని సప్లిమెంట్స్ రూపంలో ఇస్తే చక్కని ఫలితం కనిపిస్తుంది.ఇంకా జీర్ణక్రియ లోపాలు కూడా తగ్గాయి. అందువల్ల పాలకూర తోటకూర,లెట్యూస్ లో ఈ నైట్రిట్ శాతం ఎక్కువ కాబట్టి వాటిని ఆహారంలో భాగంగా చేసుకొంటే కాలేయ వ్యాధులను రాకుండా కాపాడుకొవచ్చని చెపుతున్నారు.

Leave a comment