కూరగాయలు తినేందుకు పిల్లలు ఇష్టం చూపించరు. తిననంటే తిననంటారు. కూరలు తినకపోతే పోషకాలు అందవని  పెద్దలకు భయంగా ఉంటుంది.పిల్లలని గట్టిగా మందలిస్తే అసలు తినమనేస్తారు.వారిలో కూరగాయల పట్ల ఆసక్తి కలగాలంటే వాటిపైన వ్యతిరేకత పోవాలంటే వాళ్ళ గదిలో గాలికి ఊగే విండ్ చెమ్స్ (Wind Chimes)గార్డెన్ ఆర్ట్ కూరగాయలను వేలాడదీయమంటారు అధ్యయనకారులు. గాలికి ఊగుతూ ఎదురుగా రంగు రంగుల్లో కనిపించే మట్టితో చేసిన ఆ పిల్ల క్యారెట్ లు కూరగాయల మొక్కల బొమ్మలు చూస్తుంటే పిల్లల్లో వాటి పట్ల వ్యతిరేకత తగ్గిపోయి నెమ్మదిగా తినటం అలవాటు చేసుకుంటారని చెబుతున్నారు.

Leave a comment