జుట్టు పొడుగ్గా పొట్టిగా వున్నా అది మెరుపుతో మెరుస్తూ కనిపించాలి. ఒక్క సారి జుట్టు ఏ హార్మోన్ల ప్రభావం తోనూ, అనారోగ్య కారణం గానో పోదిబారినట్లు నిర్జీవంగా అయిపోతుంది. తలస్నానం చేసిన ఫ్రెష్ నెస్ కనిపించదు. అలాంటప్పుడు  గ్రీన్ టీ ని మరగ కాచి చల్లార్చి అందులో ఆలివ్ నూనె కలిపి కుదుళ్ళ నుంచి కోణాల వరకు తలకు పట్టించి ఓ అరగంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు జాలువారుతూ మెరుపులతో కనిపిస్తుంది. ఏ కాలంలోనైనా కష్ట ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనెల్ని సమానంగా     తీసుకుని మరగించి చల్లార్చి రోజు మర్చి రోజు గానీ వారానికి రెండు   సార్లు  కానీ జుట్టుకు పట్టించి తలస్నానం చేస్తే జుట్టు పొడిబార కుండా చక్కగా వుంటుంది.

Leave a comment