జమునా బోరో

జమునా బోరో అంతర్జాతీయ బాక్సర్ గుహవ ట లో జరిగిన రెండవ ఇండియా ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్ లో బంగారు పతకం సాధించింది. అస్సాంలోని  దేకియాజులి మా సొంతూరు మా నాన్న లేరు. మా అమ్మ మా ముగ్గురు పిల్లల కోసం కూరలు వ్యాపారం చేసేది. మా స్కూలుకు వెళ్ళే దారిలో బాక్సింగ్ వంటి ఉషూ నేర్చుకునే వాళ్లను చూసాను. ఆ ఆట నచ్చి చేరిపోయాను. ఉషూ లో చేర్చమని అడిగితే మా అమ్మ ఓ సారి గెలిచి చూపెట్ట మంది అలా అమ్మ కోసం ఆ క్రీడా నేర్చుకుని జోనల్ స్థాయిలో గెలిచి బంగారు పతకం గెలుచుకున్న బాక్సింగ్ నేర్చుకునేందుకు అనుమతిచ్చింది అమ్మ. ఎంతో కష్టపడి డబ్బు ఇచ్చేది చివరికి రీజనల్ సెంటర్ వాటిలో నాకు బాక్సింగ్ నేర్చుకునే అవకాశం వచ్చాక మా పరిస్థితులు చక్కబడ్డాయి ప్రపంచ బాక్సింగ్ పోటీల్లో కాంస్యం పథకాన్ని సాధించాను  మేరీ కోమ్ నాకు ఆదర్శం అంటుంది జమునా బోరో.