జానపదే గేయాలు-అద్దరి

డి.సుజాతా దేవి

చెప్పకోయి మావా నీ
ఉప్పలాయి మాటలు
గొప్పలు డప్పేసుకునే
తిప్పలేన ఎప్పుడూ!!

పెద్దాపురం కోకంటావ్
అద్దాలా రైకంటావ్
నిద్దర మొక మేసుకుని
పొద్దూకులు పాడుకుంటావ్!!
పొద్దు బారెడెక్కినా
ముద్దూ ముచ్చట లంటావ్
అద్దరి కోతల కెళితే
ఇద్దరి కూలో త్తదిరో!!
ఎల్లీ మల్లీ కూలికి వెళ్ళి
మద్దినేల కొత్తన్నరు
మణిసి పుటక పుట్టినావు
మాట సెబితే ఇనుకోవు!!