జాతి రత్నాల్లో పుచ్చమణి కుడా వుంది. ఈ వాటర్ మెలన్  టూర్ మలీన్ రాళ్ళలో గులాబీ, ఎరుపు, ఆకుపచ్చ, నీలం, గోధుమ ఇలా ఎన్నో రంగులుంటాయి. ఒకప్పుడు శ్రీలంకలో దొరికే ఈ పుచ్చమణులు    బ్రెజిల్ నైజీరియాల్లోనూ దొరుకుతున్నాయి.చుట్టూ ఆకు పచ్చ, మధ్యలో ఎరుపు వుండే ఈ రాళ్ళని ఎక్కువ చేక్కకుండా, సహజ రంగుల సమ్మేళనం చెడకుండా నగల్లో పోదిగిస్తారు. పెండెంట్లు, చెవి పోగులు, ఉంగరాలు, బ్రాస్ లెట్స్, నెక్లెస్లో వాడతారు. ఆకు పచ్చ, గులాబీ రంగుల్లో మెరిస్తే ఈ సుందరమైన రత్న   ఖనిజాన్ని పొదిగిన  నగలను ఇమేజస్ లో చూడొచ్చు. ఈ రాళ్ళ అందం అపూర్వం.

Leave a comment