వారంతాల్లో సెలవులు కాబట్టి అర్ధరాత్రి వరకు కబుర్లు సినిమాలు ఆ మర్నాడంతా నిద్రపోవడం నేటి యువత లో సూర్య సామాన్యంగా జరుగుతున్న అంశం. దీని పర్యవసానం భవిష్యత్తులో బయట పడుతుంది అంటారు ఎక్స్ పర్ట్స్. ఈ సోషల్ జెట్ లాగ్ తో హృద్రోగాలు వచ్చే అవకాశం 11 శాతం ఎక్కువని తేలిందట. చాలా మంది రాత్రి 11 గంటలకు పడుకుని ఉదయం చాలా ఆలస్యంగా నిద్రలేస్తాడు. అలాగే వారంతాల్లో ఇంకా లేట్ గా పడుకుని లేట్ గా నిద్రలేస్తారు. ఈ లేట్ చేసే గంటల వల్ల జీవగడియారం మొత్తంగా దెబ్బతిని పోతుంది. అది తరచూ మార్పులకు లోనవ్వుతుంటే ఎన్నో లేని పోనీ వ్యర్ధాలను తెచ్చుకొన్నట్లు అవుతుందని ఈ పద్దతి సరైనది కాదంటారు. పరిశోధకులు. దీని వల్ల అలసట మూడ్ సరిగ్గా లేకపోవడం, అతిగా నిద్రపోవడం వంటివి జరుగుతాయి అని నిపుణుల బృందం చెప్పుతున్నారు.

Leave a comment