జీవన శైలి కారణం కావొచ్చు.

చాలా మందికి చిన్న వయసు నుంచే కళ్ళ చుట్టూ నల్లని వలయాలు వస్తాయి. ఇందులో రకరకాల కారణాలు ఉండవచ్చు. కళ్ళ కింద టిష్యు, పల్చగా సున్నితంగా వుంటుంది. ఎలర్జీలు, ఆస్మా, ముక్కు దిబ్బడ, సైనస్ చుట్టూ రక్త సరఫరాను పెంచుతాయి. దీని వల్ల కాళ్ళకింద వెజిల్స్ ప్రాముఖ్యంగా కనబడుతూ ఉంటాయి. ఎలర్జీలు, నల్లని వలయాల నుంచి కాపాడుకునేందుకు వైద్యులు స్టెరాయిడ్స్ ఇన్హేలర్ సూచిస్తారు. దీని వల్ల రెస్పిరేటరీ  సమస్యకు చికిత్స లభించి ఇన్ ఫ్లమేటరి బ్లడ్ ఫ్లో ఈ ప్రదేశానికి తగ్గుతుంది. నల్లని వలయాలు కనిపించకుండా కన్సీలర్ వాడాలి. నల్లని వలయాలు, ఎలర్జీలు, ఆస్మాకు సంబందించినవి కాకపొతే జీవన శైలి వల్ల కావచ్చు. ఎండలకు ఎక్స్ పోజ్ అవటం, చుట్టూ కాలుష్యం, దుమ్ము లేదా ముఖ్యంగా నిద్ర లేమి వల్ల కూడా కావొచ్చు. విటమిన్-ఇ ఆధారిత మాయిశ్చురైజర్ ను ప్రతి రోజు వాడాలి.