జిడ్డు పోతుంది.

ఖరీదైన సోప్ లు వాష్ లతో మొహం శుభ్రం చేస్తూ ఉన్నా కాసేపట్లో ఫ్రెష్ నెస్ పోయి జిడ్డు కనిపిస్తూ ఉంటుంది. సెబాషియస్ గ్లాండ్స్ చురుకుగా పని చేయయటం వల్ల ఈ సమస్య వస్తుంది. సీజనల్ పండ్లు చర్మాన్నీ క్లెన్స్ చేస్తాయి. యాపిల్ జ్యూస్ ,నిమ్మరసం కలిపి మొహానికి పట్టించి పది నిమిషాల తర్వాత కడిగేయాలి. నిమ్మరసం పచ్చిపాలు కూడా బాగా క్లెన్స్ చేస్తాయి. తేనె ,ముల్తానీ మట్టి కలిపి పేస్ ప్యాక్ వేసుకున్న మంచిదే .స్ట్రాబెర్రీ గుజ్జు ,అలో వేరా ఓట్స్ పొడి కలిపి ఫేస్ ప్యాక్ వేసుకొంటే ఇది అదనపు నూనెను పీల్చి చర్మరంధ్రాలు మూసుకు పోకుండా కపాడుతోంది. దీన్నీ ఫ్రిజ్ లో ఉంచివాడితే కోల్డ్ కంప్రెషన్ లాగా పనిచేస్తుంది.