ముఖం ఎంత అందంగా ఉన్న గంటలకొద్ది బయట ఉన్న ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆఫీస్ పనుల్లో మునిగినా జిడ్డుగా అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు కలబంద గుజ్జుతో చర్మాన్ని మృదువుగా మర్ధన చేస్తే మృతకణాలు,జిడ్డు తొలగిపోయి శుభ్రనపడుతోంది. లంచ్ బ్రేక్ లో ఇలా గుజ్జుతో మొహాం కడుక్కొంటే జిడ్డు అనిపించదు. జిడ్డు చర్మతత్వం అయితే మాటిమాటికి చన్నీళ్ళతో మొహాం కడుక్కొంటే చాలు ,మొహాం తుడుచుకోకుండా తడి దానంతట అదే ఆరిపోయోలా చేస్తే జిడ్డు పేరుకోకుండా ఉంటుంది. నారింజ,యాపిల్ వంటి వాటితో ఫేస్ పాక్ వేసుకొన్న ఈ పండ్లరసాలలో దూది ముంచి తుడుచుకొంటువున్న జిడ్డు దూరం అవుతుంది. నిమ్మరసం తేనె కలిపి మొహానికి రాసుకొని ,పావుగంట ఆగాక కడుక్కొంటే నిమ్మరసం సహాజమైన యాంస్ట్రంజెంట్ లా పని చేసి అదనంగా పేరుకొన్న జిడ్డుతొలగిస్తుంది.

Leave a comment