జుట్టు అందంగా…

చలి కాలంలో జుట్టు బిగుసుకుని తేమ లేకుండా పోతుంది. అలాంటప్పుడు శిరోజాలు మెరుస్తూ మెత్తగా ఉండాలనుకుంటే పావు కప్పు బాదం నూనెలో ఒక గుడ్డు సొన వేసి గిలకొట్టి నీటితో షాంపు చేస్తే బాదం నూనేలో సహజమైన నూనెలు, గుడ్డులోని ప్రోటీన్లు దెబ్బతిన్న శిరోజాలను మృదువుగా మారుస్తాయి. పండిన అరటి పండులో తేనె ,కొబ్బరి నూనె కలిపి పేస్ట్ లా చేసి జుట్టుకు పట్టించి ఓ అరగంట ఆగి తలస్నానం చేస్తే మంచిది. వారానికి రెండు సార్లు ఇలా చేసినా మంచి ఫలితం ఉంటుంది.