జుట్టు జాగ్రత్త

సూర్యకిరణాల ప్రతికూల ప్రభావం వల్ల క్లోరిన్,ఉప్పు నీటి ప్రభావం వల్లనూ శిరోజాలు కుదుళ్ళు బలహీనమై ఊడిపోతాయి.జుట్టు లో రెసిడ్యూలు ఉంచగల భారీ ఉత్పత్తులను వాడవద్దు. ఆల్కహాల్ ,పార్మల్ డీ హైడ్ గల ఉత్పత్తులు శిరోజాలను పొడిగా అయ్యేలా చేసేస్తాయి. సల్ఫేట్ ఫ్రీ షాంపూ,కండిషనర్లు వాడాలి. ఇవి జుట్టులోని విమిల్ బ్యాలెన్స్ ను మెయిన్ టెయిన్ చేస్తాయి. వీలైనంత వరకు స్ట్రెయిటనింగ్ కలరింగ్ వంటి కెమికల్ ట్రీట్ మెంట్లు కు దూరంగా ఉండాలి. వీటిలో వాడే రసాయినాలతో ప్రోటీన్ బోర్స్ నశించి పోయి జుట్టు కుదుళ్ళకు హాని కలుగుతుంది. తల స్నానం అయ్యాకా లీవ్ ఇన్ కండీషనర్లు అప్లైయ్ చేస్తే రోజంతా సూర్యకిరణాల నుంచి రక్షణ లభిస్తుంది.