ఉల్లిపాయ కొస్తే కన్నీళ్లు పెట్టుకొని వాళ్ళు భూప్రపంచంలో ఎవ్వళ్ళూ ఉండరుకదా .కానీ తాజాగా సునీయన్ జాతి ఉల్లిపాయ అభివృద్ధి చేసారు శాస్త్రవేత్తలు .సక్రమమైన పద్దతిలో వ్యవసాయ క్షేత్రములో పునరుత్పత్తి ద్వారా వంగడాన్ని సృష్టించారు .సైజ్ లో కాస్త చిన్నవిగా ఉంటాయి .రుచిలో తేడా ఉండదు కానీ కొస్తే కన్నీళ్లు తెప్పించే ఘాటు ఉండదు .ఉల్లిపాయలో ఉండే సింథాల్ వాయువులు కళ్ళను తాకితే ఆ మంటతో నీళ్లు వస్తాయి .సునీయన్ లో దాని తీవ్రత చాలా స్వల్పం .అమెరికా , నెవాడా వాషింగ్టన్ లో రైతులు సునీయన్ సాగు మొదలుపెట్టేసారు .చాలా త్వరలో మనకు వస్తాయి .ఈ సునీయన్ ఉల్లిపాయలు . Yurekha yi

Leave a comment