చీటికి మాటికి కళ్ళనీళ్ళు పెట్టుకుంటే తప్పు కానీ మనసారా ఏడవటం వల్ల కూడా సానుకూల ఫలితాలుంటాయి అంటున్నాయి అద్యయనాలు. ఏడవటం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం రెండు దక్కుతాయి. కన్నీళ్ళు కను గుడ్లు,రెప్పలకు తేమను అందిస్తాయి. కళ్ళను శుభ్రం చేస్తాయి. కన్నీళ్ళు యాంటీ బ్యాక్టిరియాగా యాంటీ వైరల్ గా పని చేస్తాయి. ఏడవటం వల్ల మనుషులు గూడుకట్టుకున్న దిగాలు, భారం పోయి మానసిక ప్రశాంతత దక్కుతుంది. భావోద్వేగాల ఒత్తిడి తగ్గిపోతుంది. హాయిగా నవ్వండి అన్న పదంతో పాటు బాధ కలిగితే మనసారా కన్నీళ్ళు పెట్టుకోండి తేలికైపోతారు అని చెప్పాలన్నమాట.

Leave a comment