Categories
WoW

కన్నుల పండగ్గా శుకవనం.

పిల్లాలకు కొన్ని తప్పని సరిగా చూపించవలసిన ప్రదేశాలు వున్నాయి. వాటిలో ఒకటి మైసూరు లోని శుకవనం. ఒక్కటో రెండో చిలుకలు ఏ మామిడి  కొమ్మ పైనో వాలితే పిల్లలు ఎంతో ఆనందిస్తారు. అలాంటిది వెయ్యి చిలుకలు ఒకే సారి కనిపిస్తే విభిన్న దేశాలు, ఖండాల్లోని 465 జాతులకు చెందిన రెండు వేలకు పైగా చిలుకలు ఈ శుకవనం లో వున్నాయి. గణపతి సబ్బదానంత స్వామి ఆధ్వర్యం లో వున్న ఈ శుకవనం, ప్రపంచంలోనే అతి ఎక్కువ జాతులున్న చిలుకల తోటగా ఇటీవలే గిన్నీస్ రికార్డ్స్ లోకి ఎక్కింది. దత్త పీఠం ఆశ్రమ ప్రాంతంలో వున్న శుకవనం లో చిలుకల్ని చూసేందుకు ఎంతో మంది బడి పిల్లలు వస్తాయి. అవి వారి దగ్గరకు వచ్చి వాలిపోతాయి. పచ్చని చిలుకలే కాదు, పసుపు కుంకుమ రంగుల్లోనూ, ఎరుపు పసుపు వర్ణాలలోనూ తెల్లని చిలుకలు, పాలపిట్టలాంటి నీలిరంగు లోనూ ఉదా పిచ్చుకంట నుంచి డేగంత పెద్దవి కూడా ఈ శుకవనంలో హాయిగా విహరిస్తూ ఉంటాయి. పిల్లలకు తప్పకుండా చూపించాలి ఈ చిలుకల తోటని.

Leave a comment