చాలా ఖరీదైన చీరెలు కొన్నాక అవి చాలా కాలం మన్నికగా మెరుపు పోకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముందుగా ఖరీదైన చీరెల రంగు పోకుండా ఉండాలంటె బకెట్ నీళ్ళలో పావు కప్పు వెనిగర్ వేసి చీరెను అందులో నాననివ్వాలి.కాసేపయ్యాక తేలికైన సబ్బుతో ఉతికేసి ఆరేయవచ్చు. సిల్క్,జరీ చీరెలు అలా కొన్నాళ్ళు బీరువాలో ఉంచితే మడత దగ్గర చినిగిపోతాయి.లేక పోతే మడత దగ్గర తెల్లటి చారలా పడతాయి. ఇస్త్రీ చేసినా ఈ తెలుపు మడతలు పోవు. అందుకే నెలకోసారి అయినా చీరెను తీసి ఎండలో వేసి మడతలు మార్చి వేస్తూ ఉండాలి.పట్టు,జర్దోసి, జరీ చీరెలను పాత కాటన్ చీరెలు చుట్టి దాచి ఉంచాలి. అలాగే సిలికాజెల్ సాచెట్లు ఈ చీరెల మడతల్లో పెడితే తేమ చేరకుండా ఉంటుంది.చీరెల పైన ఏ నూనె మరకో పడితే వెంటనే దాని పైన టాల్కమ్ పౌడర్ చల్లి బ్రష్ తో దులిపేస్తే నూనె మాయం అవుతుంది. చీరెలు బీరువాల్లో వేపాకులు వేస్తే వాటిలో ఉండే యాంటీ ఫంగస్ గుణాల వల్ల దుర్వాసనలు రావు.

Leave a comment