Categories
Soyagam

కొంచెం మేకప్‌ అవసరం

ఏదైనా ప్రత్యేక సందర్భాలకు తయారవుతున్నప్పుడు మేకప్ విషయంలో కొన్నీ జాగ్రత్తలు తీసుకొంటే చాలా సేపు మొహాం ఫ్రెష్ గా ఉంటుంది. పొడిచర్మం ఉన్న వాళ్ళు క్రీం తరహా ప్రైమర్ ఎంచుకొంటే ఇది చర్మానికి తేమ అందిస్తుంది. అప్పుడు దానిపై ఫౌండేషన్ ఎక్కువ సేపు నిలబడుతుంది.చర్మం జిడ్డుగా ఉందనిపిస్తే మ్యాటీ తరహా ప్రైమర్ ఎంచుకొంటే సరిపోతుంది. దీన్ని కొద్దిగా అప్లైచేస్తే ముఖంపై రంధ్రాలు కనిపించకండా ఉంటాయి. ఫౌండేషన్ జిడ్డుగా అయిపోకుండా ఉంటుంది. చర్మం సున్నితంగా ఉంది అనిపిస్తే కరెక్టర్ ప్రైమర్ ఎంచుకంటే ఇది చర్మాన్నీ ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మతత్వానికి నాప్పే ప్రైమర్ ఎంచుకొంటే మేకప్ ఎక్కువసేపు నిలబడి ఉంటుంది.

Leave a comment