గీతు మోహన్ దాస్ తీసిన లయర్స్ డైస్ చిత్రం ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఉత్తమ చిత్రం. చైనా బార్డర్ లో ఉన్న చిట్కుల్ అన్న పల్లెటూరు ఢిల్లీ సమీపంలో ఉంటుంది. ట్రైబల్ కమ్యూనిటీ కి చెందిన కమల భర్త ఐదు నెలలుగా జాడ తెలియకుండా ఉంటాడు.ఢిల్లీలో ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసే అతన్ని వెతుక్కుంటూ కమల తన కూతురు మూడేళ్ల కూతురు తో బయలుదేరుతుంది. సైన్యం నుంచి పారిపోయి వస్తున్న సిపాయి నవాజుద్దీన్  ను అనుకోకుండా కలుసుకొని అతనితో ప్రయాణం చేస్తూ ఢిల్లీ కి చేరుకుంటుంది.కమల భర్త కోసం వెతుకుతూ వెళ్లిన నవాజ్ కు అతని వస్తువులు ఫోన్ కంపెనీ నుంచి అందుతాయి. ఆ విషయం కమల్ కు చెప్పేందుకు మనస్కరించక ఊరుకుంటాడు. కానీ కమల చేసిన ఫోన్ కాల్ కు రిప్లై నవాజ్ బ్యాగ్ నుంచి రావటంతో కమలా కు నిజం తెలుస్తుంది. ఆమె తన పల్లెకు తిరిగి వెళ్ళిపోతుంది కమల భర్త పని చేసిన కంపెనీలో నవాజ్ పనికి కుదుర్చుకుంటాడు పల్లెల నుంచి పట్టణాలకు మైగ్రేట్ అయిన కూలీలు ఎలాంటి భద్రతా హామీ లేని స్థితిలో పనులు చేస్తున్నారో ఈ చిత్రం చూపిస్తుంది సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఉంది.
రవిచంద్ర. సి   
7093440630

Leave a comment