లైట్ గా పర్లేదు

టీనేజ్ అమ్మాయిలు మేకప్ ఇష్టపడరు. కాని సాయంత్రం వరకు బయట గడపాలంటే మొహం ఫ్రెష్ నెస్ తో ఉండేందుకు తగు మోతాదు మేకప్ వల్ల చర్మానికి హాని జరగదు. టెంటెడ్ మాయిశ్చరయిజర్స్, బేబీ క్రిమ్స్ తేలికపాటి టెక్చర్చర్ కలిగి ఉంటాయి. లైట్ గా చర్మం మెత్తగా ఉంటుంది. పరిశుభ్రమైన మేకప్ వస్తువులు వాడాలి. క్లెన్స్ డ్ చర్మం పై తాజ ఉత్పత్తులను వాడితే మేలు. క్రీమ్‌ ఆధారిత ఉత్పత్తులను ప్రతి ఆరు నెలలకు కొత్తవి తీసుకోవాలి. ఫౌడర్ ఆధరిత మేకప్ ఉత్పత్తులను కూడా సంవత్సరానికి మించి వాడకూడదు. ఎప్పటికప్పుడు మేకప్ బ్రష్ లు శుభ్రం చేయాలి. సాయంత్రానికి మేకప్ తీసి వేయలి. మేకప్ రిమూవర్ క్లీన్ చేసి ఫేష్ వాష్ చేసుకుని రాత్రివేళ నొరిషింగ్ క్రీమ్ రాసుకోవాలి. ఇలాంటి నిబంధన పాటిస్తే చర్మం పాడవ్వకుండ ఉంటుది.