చలిరోజుల్లో తలకు చుట్టుకునే స్కార్ఫ్ లు ఉలెన్ క్యాప్స్ జుట్టు పై తేమను పీల్చేసి పొడిబారేలా చేస్తాయి.ఈ సమస్యకు హాట్ ఆయిల్ థెరపీ నే  అసలైన చికిత్స.అలాగే బియ్యం కడిగిన నీటిలో  కొంచెం పాలు, తేనె కలుపుకుని జుట్టు మొత్తం పట్టించి ఇరవై నిమిషాలు ఆరనిచ్చి కడిగేస్తే మాడు   లో, వెంట్రుకల్లో తేమ వస్తుంది.తులసి మెంతులు హెర్బల్ టీ లేదా పెప్పర్ మెంట్ నీళ్ళలో నాననిచ్చి ఆ నీటిని వడకట్టి చివరి రన్స్ గా ఉపయోగించుకోవాలి. రోజ్ మేరీ, ఉసిరి, వేపాకు, గోరింటాకు, కరివేపాకు, మందార ఆకులు, పూలు వంటి శిరోజాలకు మేలు చేస్తాయి.హెర్బల్ టీ డికాషన్ తో జుట్టును తలంటు స్నానం లో చివరి రన్స్ గా ఉపయోగిస్తే డీప్ క్లెన్సర్ గా ఉపయోగిస్తుంది.

Leave a comment