జీవితంలో ప్రతి క్షణాన్ని నేను ఆస్వాదిస్తూ ఉంటాను. నాలో ఉన్న లోపాలు పోగొట్టుకునేందుకు ఎంత కష్టమైన పని అయినా చేస్తా.అంత వరకూ ఎందుకు నాకు ఎత్తైన ప్రదేశాలంటే భయం. ఆ భయం పోగోట్టుకునేందుకు ఇరవై అడుగుల ఎత్తు నుంచి ఎలాంటి రక్షణ లేకుండా దూకేస్తాను అంటుంది పూజా హెగ్డే. ఇలాంటి తింగరి పనులు ఎందుకు చేస్తావంటే ముందుగా నాలో ఉన్నా భయం పోవాలి కదా. నేను కాస్త పిరికిదాన్నె ఆ పిరికితనం పోవాలి అంటే ఇలాంటివన్ని చేసి ధైర్యంగా అయిపోవాలి. మనని మనం తీర్చిదిద్దుకునే మార్గాలు అన్వేషించాలి అంటుంది పూజాహెగ్డె. ఆమె ప్రస్తుతం అరవిందా సమేత వీర రాఘవలో నటిస్తుంది.

Leave a comment