కళ్ళకింది వలయాలు ఇబ్బంది పెడుతూవుంటే కాస్త మేకప్ తో వాటిని దాచేయవచ్చు .కన్సీలర్ ఈ నల్లని మచ్చలు ,వలయాలు దాచిబెట్టగలవు. స్కీన్ టోన్ కంటే కొంచెం లైటర్ షేడ్ టోన్ ఎంచుకోవాలి. కళ్ళ కింద వాడే అండర్ ఐ క్రోమ్ ను కొంచెం ఎక్కవగా కన్సీలర్ అప్లైయ్ చేసే ముందు రాసుకోవాలి. దీని వల్ల కన్సీలర్ నుంచి ఎక్కువ మాయిశ్చరైజర్ ను చర్మం తీసుకోదు. ఫౌండేషన్ కంటే ముందే కన్సీలర్ రాయాలి. చేతి వేళ్ళతో బాగా బ్లెండ్ చేస్తూ కన్సీలర్ అప్లైయ్ చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. సరైన రూపం తెచ్చుకోవటం కోసం కాస్త మేకప్ అవసరమే.

Leave a comment