మహానటికి మరో గౌరవం

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజంతి మూవీస్ నిర్మించిన మహానటి చిత్రానికి ఒక అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ప్రదర్శన కోసం ఈ సినిమా ఎంపికైంది. 49వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఆఫ్ ఇండియా ఉత్సవాలు ఈ నెలలో గోవాలో జరుగనున్నాయి. అందులో భాగంగా హిందీ ,తమిళ,మలయాళ ఇలా భారతీయ భాషలకు సంబంధించి 22 చిత్రాలు ఈ చిత్రోత్సవంలో ప్రదర్శనకు అర్హత సంపాధించాయి. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి  ఈ సంవత్సరం ఆ గౌరవం మహానటి సినిమాకు దక్కింది. ఈ సినిమాలో కీర్తీ సురేష్,సమంత ,దుల్కర్ సల్మాన్ ,విజయ్ దేవరకొండ ముఖ్యపాత్రలు పోషించారు.