హిరణ్యకశిపుని ఇరుచెక్కలుగా…..

పరచిన నరహరి పక్కనె యుండగ….!!

తక్కువేమీ మనకూ…రాముడు ఒకడుండు వరకు…     

సాక్షాత్తూ విష్ణుమూర్తి అవతారమే కదండీ!!
ప్రకాశం జిల్లాలోని కందుకూరు సమీపంలో వెలసిన క్షేత్రం మాలకొండ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి.వశిష్ట మహర్షి తపస్సుకి మెచ్చి శ్రీలక్ష్మీ  సమేతుడై భూలోకానికి వేంచేశారు.
శ్రీహరి  వాహనమైన గరుత్మంతునికి మాల ఇచ్చి భూలోకంలో మంచి ప్రదేశం చూచి ఈ మాల వేయమని ఆదేశించినట్టు గరుత్మంతుడు ఆ పచ్చని,అందమైన కొండ పైన మాలను వుంచిన ఇప్పుడు  మాలకొండ గా ప్రసిద్ధి చెందింది.
ఈ క్షేత్రంలో భక్తుల కొరకు శనివారం మాత్రమే దర్శన భాగ్యం. మిగతా రోజులు మునుల కొరకు.కొత్తగా పెళ్లయిన జంట సంతానం కోసం ముడుపులు కడతారు.ఇక్కడ మార్కండేయ నదిలో స్నానం చేసిన సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.

ఇష్టమైనపూలు: ప్రకృతినే మాలగా ధరించిన స్వామి వారికి అన్ని రంగుల పూలు సమర్పించిన ఆనందం.

నిత్య ప్రసాదం: కొబ్బరి, అన్నం పొంగలి.

అన్నం పొంగలి తయారీ: ముందుగా పాలు మరిగించి దానిలో బియ్యం కడిగి పాలలో వేసి ఉడికించాలి. తీపికి తగినంత పంచదార వేసి ఉడికించాలి. జ్వాలా నరసింహ స్వామి కి ప్రసాదం తయారు.

-తోలేటి వెంకట శిరీష

 

Leave a comment