కొంతకాలంగా క్యాన్సర్ కు చికిత్స తీసుకొంటున్న సోనాలి బింద్రే మళ్ళీ ఆరోగ్యంగా కెమెరా ముందుకు వచ్చారు. ఒక యాడ్ ఫిలింలో నటించేందుకు గాను ఆమె షూటింగ్లో పాల్గొన్నారు. ప్రస్తుతం నా మనసులో భావాలకు రూపం ఇవ్వటం చాలా కష్టం. కెమెరా ముందు నిలబడి భావోద్వేగాలు పలికంచటంలో ఉన్న ఆనందం అనుభవం చాలా గొప్పది అన్నారు సోనాలి బింద్రే. ఎంతో కాలం విరామం తర్వాత నేను షూటింగ్ చేస్తున్న . గత కొద్ది నెలలుగా నా భావోద్వేగాలు నా అదుపులో లేవు. నేను చాలా కొత్త కొత్త అనుభవాలతో ,నొప్పిని సహించటంలో మునిగి తేలాను. ఇప్పుడు కెమెరా ముందు నటించటం చాలా ఆనందంగా ఉంది అన్నారామే.

Leave a comment