భారత దేశంలో జులై’ నుంచి నవంబర్ మధ్యలో యాంటీ బయోటిక్స్ వాడకం పెరుగుతుందని ఒక నివేదిక చెప్పుతుంది. అనేక రకాల అనారోగ్యాలకు వైద్యులు ఈ మందు సిఫార్సు చేస్తారు. వీటిని వేసుకోవడం లో చిన్ని జాగ్రత్తలు పాటించాలి. ఒకటి, సరైన టైమ్ కి ఇవి వాడాలి. మాత్ర వేసుకున్నాక తప్పని సరిగా నీళ్ళు తాగాలి. ఎక్కువ నీళ్ళు తాగితే ఈ మాత్రాని సులభంగా జీర్ణవ్యవస్థ లోకి చేరేలా చేస్తుంది. కడుపులో వికారం రానివ్వకుండా నీళ్ళు కాపాడతాయి. కొన్ని చర్మ వ్యాధుల కోసం యాంటీ బయోటిక్స్  ఇస్తే ఎండలో తిరగకూడదు. కొన్ని రకాల మాత్రలు వేస్తె వైద్యుడిని సంప్రదించి మరీ వేసుకోవాలి. ఇవి వాడే సమయంలో తీసుకోవలసిన డైట్ గురించి వైద్యుదిని అడిగి తెలుసుకోవాలి.

Leave a comment