Categories
WoW

మంచి నిద్రపొతే చక్కని జ్ఞాపకశక్తి.

బాగా నిద్రపోతేనే జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుందని శాస్త్రజ్ఞులు చెపుతున్నారు. నిద్రలో మన మెదడులో కొన్ని తరంగాలు లయబద్దంగా కదులుతూ ఉంటాయని వాటిని షార్ట్ వేవ్ రిపుల్స్ అంటారు. మనకు ఏదైనా విషయం ఘాడంగా గుర్తుండటానికి కారణం ఈ తరంగాలే.  షార్ట్ వేవ్ రిపుల్స్ జ్ఞాపకశక్తి కలిగిస్తాయి. 2009లో నిర్వహించిన పరిశోధన ప్రకారం ఒక జ్ఞాపకాల దోమతెర మన మేదడులోని   హిప్పోక్యాంపసె నుంచి నియోకార్టేక్స్ కు బదిలీయై అక్కడ దీర్ఘకాలిక జ్ఞాపకాలుగా నిక్షిప్తం అవుతాయి. అంటే ఇప్పుడు మనం కంప్యుటర్ లో స్ధలం సరిపోదని, అందులో వుండే డాటాను హార్డ్ డిస్క్ లోకి ట్రాన్స్ ఫర్ చేసుకుంటున్నట్లు అన్నమాట. షార్ట్ టర్మ్ మెమోరీ గా వున్న జ్ఞాపకాలు లాంగ్ టర్మ్ మెమోరీస్ గా మారి శాశ్వతంగా ఉంటాయి. ఇందుకు కారణమైన షార్ట్ వేవ్ రిపుల్స్ అన్నీ గాఢనిద్రతోనే సాధ్యం అంటే మనం చక్కని నిద్ర పోతేనే చక్కని జ్ఞాపకశక్తి ఉంటుందన్నమాట. ఇప్పుడిక ఆరోగ్యకామైన నిద్ర అలవాట్లు డెవలప్ చేసుకోవాలి.

Leave a comment