మరింత అందంగా టస్సర్స్

పట్టులాగా కనిపిస్తూ, వంటికి హత్తుకొన్నట్లు ఉండే టస్సర్ చీరలు ఎప్పుడూ ఫ్యాషన్ . ఇవి ముదురు ,లేత వర్ణాలలో ,చిన్నపాటి జరీ అంచులు, కొంగులపై జరీ గీతాలలో పార్టీ లుక్ ఇస్తాయి కూడా. చీరకు పూర్తి కాంట్రాస్ట్ గా పైట కొంగు ఉంటుంది . అలాగే పెద్ద పూల ప్రింటు లో కలంకారీ పనితనం లో కొందరు పాంపాం టాజిల్స్ లో ఇప్పుడు పూర్తిగా రూపం మార్చుకున్నాయి . రెండు మూడు వర్ణాల కలగొలుపులతో మామిడి పిందెలు ,పక్షులు,పూవులు, ఆకుల మోటిఫ్ లతో ,రెత్రో తరహా ఆకుల అంచులతో , ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి . అలాగే జామెట్రికల్ గళ్ళ డిజైన పైన మీనా కారీ సైప్లీ మోటిఫ్ లతో ఇవి అత్యంత ఆధునికంగా కనిపిస్తున్నాయి .