మెహందీ పెట్టుకొన్నపుడు చక్కగా ఉంటుంది . కొద్ది రోజులకు అది వెలసినట్లు అయి చేతులు ,పాదాల పై మరకల్లాగా అనిపిస్తాయి . దీన్ని పూర్తిగా తొలగించాలి అంటే నిమ్మ పండు బాగా ఉపయోగ పడుతుంది . నిమ్మచెక్కతో చేతులు ,పాదాలు రుద్దేసి కాసేపయ్యాక వేడినీళ్లతో కడిగేస్తే సరి ఇలా రోజులో రెండుసార్లు చేస్తే ఫలితం కనిపిస్తుంది . టూత్ పేస్ట్ లో మెహందీ రంగును తొలగించే లక్షణాలున్నాయి . ఈ పేస్టును పలచని పొరలా రాసి సక్కగా ఆరిపోనిచ్చి నీళ్లతో కడిగేసి చేతులు పొడిగా అనిపించు తుంటే ,మాయిశ్చరైజర్ రాసుకోవాలి . వంటసోడాలోబ్లీచింగ్ గుణాలున్నాయి . వంటసోడా నిమ్మరసం కలిపి మెహందీ పెట్టుకొన్న చోట రాసి పదినిమిషాల్లో కడిగేసుకోవాలి తర్వాత మాయిశ్చరైజర్ రాస్తే బాగుంటుంది . లేకుంటే చేతులు పొడిబారి బ రకంగా కనిపిస్తాయి .

Leave a comment