మేకప్ సహజంగా

మేకప్ చాల సహజంగా ఉండాలి. అలంకరణ సామాగ్రి ఎంపిక విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఫౌండేషన్ చర్మానికి దగ్గరగా ఉండే రంగులో తీసుకోవాలి. ఆరుబయట వెలుగులు పరిక్షించుకొంటే సరైన ఫౌండేషన్ ఎంచుకొవచ్చు. ముఖంపైన మృత కణాలు పోయేలా మంచి క్లెన్సర్ తో వాష్ చేసుకొవాలి. అప్పుడు ఫౌండేషన్ చక్కగా చర్మంలో ఇంకి సహజంగా కనిపిస్తుంది. కణతల ముక్కు ,నుదురు, మెడ వంటి చోట్ల బ్రాండ్ పౌడర్ రాసుకోవాలి. లిప్ గ్లాస్ ,పౌడర్ కూడా చాలా కొద్దిగానే అప్లైయ్ చేయాలి. ఇవి ఎంత తక్కువఉంటే అంత అందంగా సహాజంగా ఉంటుంది.లిప్ స్టిక్ ఎంచుకొనే సమయంలో నేరుగా పెదవులకు రాసుకొని చూడాలి. ఏ చేతితో రాసి చూసుకొంటే సరిగ్గా ఉండదు. పెదవుల రంగులకీ,చేతుల రంగుకీ చాలా తేడా ఉంటుంది.