కాఫీలు, టీలు,కూల్ డ్రింక్ లూ తాగుతారు కనుక దంతాలపైన ఉండే ఏనామిల్ అనే తెల్లని పొరపోయి పచ్చగా అయిపోతాయి. యాంటీ బయోటిక్స్ ,ఇతర మందుల వాడకం వంటి కారణాల వల్ల కూడా పళ్ళ ఏనామిల్ పొర దెబ్బతిని దంతాలు మెరుపు పోగొంటుకుంటాయి. టూత్ పేస్ట్ లో కాస్త బేకింగ్ సోడా బాగా కలిపి బ్రెష్ చేసి గోరువెచ్చని నీళ్ళతో పుక్కిలిస్తే కొంత ఫలితం ఉంటుంది. లేదా కమల పళ్ళతొక్కలను ఎండ బెట్టి పొడి చేసి ఆపొడితో దంతాలపై రుద్ధినా ఆ తొక్కలోని విటమిన్ సి కారణంగా దంతాలు మెరిసిపోతాయి. నిమ్మరసం ఉప్పు మిశ్రమంతో పళ్ళుతోమినా పసుపు రంగు పోయి దంతాలు తెల్లగా మెరిసిపోతాయి.

Leave a comment