మెట్లెక్కి దిగండి

వ్యాయామం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది.అయితే వాకింగ్ కు జిమ్ కు వెళ్లేందుకు సమయం అవకాశం రెండూ లేవు.ప్రస్తుత పరిస్థితుల్లో బంధుమిత్రులను ఎక్కువగా కలిసేందుకు లేదు. సామాజిక సంబంధాలు తగ్గిపోవటం కూడా ఆ ప్రభావం. మానసిక స్థితి గతుల పైన పడుతుంది అలాంటి సందర్భంలో ఇంట్లోనే మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉండమని ఇంటి చుట్టుపక్కల వేగంగా నడవమని చెబుతున్నారు. జర్మనీలో ఆరోగ్య నిపుణులు అలాగే వారానికి 150 నిమిషాలు అంటే రెండున్నర గంటల పాటు ఇంటిపని తోట పని చేసి కూడా ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. లిఫ్ట్ వాడకం పూర్తిగా మానేసి మెట్లు దారి నడిచి వెళ్లడం అలవాటు చేసుకోండి మంచిదే అంటున్నారు.

చేబ్రోలు శ్యామసుందర్
9849524134