Categories
Wahrevaa

మొక్క జొన్న పొత్తుల్లో సంతోషం.

వర్షం చిన్కుల తో పాటు మొక్కజొన్న పొత్తులు వచ్చేసాయి. నిప్పుల్లో కాల్చేసి పైన నిమ్మరసం పిండిన మొక్క జొన్న కందేల్ని ఎవరేనా ఇష్టపడతారు. ఇవి తింటే సంతోషం కలుగుతుందిట. ఎందుకంటే సంతోషానిచ్చే రాసాయినాలైనా ఫ్లేవనాయిడ్స్ మొక్కజొన్నలో వున్నాయి. ఇందులో బీటా కెరోటిన్ పుష్కలంగా వుంది. వంద గ్రాముల మొక్కజొన్న గింజల్లో ఒక రోజుకి అవసరమైన విటమిన్ ఏ లోని ఆరు శాతం మనకు దొరుకుతుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మొక్కజొన్నలో విటమిన్-బి ఆరోగ్యానికి ప్రధాన ఖనిజాలైన జింక్, మంగానీస్, కాపర్, ఐరన్ వంటివి వున్నాయి. మొక్కజొన్న మంచి స్నాక్ ఇందులో నూనె వేసి వనదేవి ఏదీ లేదు. కేవలం నిప్పుల పైన కలిస్తే చాలు. స్వీట్ కార్న్ అయితే ఉడికించి తింటే మేలు. చర్మానికి చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Leave a comment