నమెగో వ్యాలీ జపాన్ లోని టెంకవా పర్వతాల్లో ఉంది. ఎటుచూసినా పచ్చదనంతో నిండిన కొండలు మధ్య మధ్యలో పూలదండలతో అలంకరించినట్లు కనిపించే ఈ వ్యాలీ కన్నుల పండుగగా ఉంటుంది. మొత్తం ఈ కొండలన్నీ ఆకుపచ్చరంగులో ఉంటాయి. శిఖరాలు మాత్రం వేరే వేరే రంగులతో ఉంటాయి. కొండల అంచున  చెర్రీ వృక్షాలు వాలు పైన  వరసల్లో కొనిఫెర్  చెట్లు ఉంటాయి. రుతువులు మారితే చెర్రీ  ఆకుల రంగు మారుతుంది. కనుక ఆ ప్రదేశం రంగుల పూల దండలు అమర్చినట్లు కనిపిస్తుంది.ప్రపంచంలోనే అతి సుందరమైన ప్రదేశాల్లో నమెగో వాలీ.

Leave a comment