ముడతలూ ,వలయాలు మాయం

ఒక్క రోజ్ వాటర్ తో బోలెడన్ని సౌందర్య చికిత్సలు చేయవచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. కళ్ళ కింద నల్లని వలయాలు ఉంటే రోజ్ వాటర్ లో టీ స్పూన్ గంధం పొడి కలిపి పేస్టులాగా చేసి నలుపుగా ఉన్న ప్రాంతంలో కళ్ళపైన ,కళ్ళకింద రాసి పది నిమిషాలు ఆరనిచ్చి కడిగేయాలి. బాధం నూనెలో రోజ్ వాటర్ కలిపి అందులో ముంచిన దూదిని కళ్ళకింద ముడతలు పోవాలంటే రోజ్ వాటర్ ను చల్లని పాలలో కలిపి అందులో దూది ముంచి కళ్ళపైన పెట్టుకొంటే చాలు, ఇలా ప్రతి రోజు చేస్తూ ఉంటే కళ్ళకింద ముడతలు నలుపు కూడా పోతుంది. ఒత్తిడిగా ఉన్న రోజ్ వాటర్ లో తడిపిన చల్లని దూదిని కళ్ళ పైన పెట్టుకొని 10 నిమిషాలు విశ్రాంతి తీసుకొంటే చాలు.