మల్టీ టాస్కింగ్ అలవాటే

క్రిమినల్ లాయర్ కావాలన్నది నా చిన్ననాటి కల, అలాగే సినిమాలంటేను చాలా ఇష్టం. ఒక వైపు చదువు ,ఒక వైపు నటన నాకేమీ ఇబ్బంది అనిపించలేదు. ‘ నేల టికెట్ ‘ విడుదలప్పుడు ఎల్ ఎల్ బి సెమిస్టర్స్ జరిగాయి. ముంబయ్ లో పరీక్షలు రాసి హైద్రాబాద్ లో సినిమా ప్రమోషన్ కోసం వచేదాన్ని ‘రెడ్’ సినిమా షూటింగ్ గోవా లో జరిగినప్పుడు ముంబై వెళ్లి పరీక్షలు రాశాను నాకు మల్టీ టాస్కింగ్ అలవాటే అంటోంది మాళవికా శర్మ. ఇటు కధానాయిక గాను అటు లాయర్ గా రెండు కోర్కెలు  తీర్చుకొంటున్నాను. ఈ ఏడాది తమిళ తెర కు పరిచయం కాబోతున్నా అంటూ సంతోషంగా చెపుతోంది నటి మాళవికా శర్మ. సంక్రాంతికి రామ్ తో కలసి నటించిన రెడ్ విడుదల అవుతోంది.