ఫెయిర్ నెస్ క్రీములు మొహన్ని తెటగా ఉంచుతాయో లేదో తెలీదు కానీ ఎన్నో చర్మ సమస్యలకు మాత్రం కారణం అవుతున్నాయంటున్నారు. డాక్టర్స్ క్రీమ్ లలో సాధరణంగా వాడే బెక్లామెథాఫోన్, బీటా మెథాఫోన్ వంటి స్టెరాయిడ్స్ చర్మం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. వీటి వల్లనే చర్మం పిగ్మెంటేషన్ కు గురవుతుంది. వీటిని నిరంతరం వాడటం వల్ల చర్మం పలుచగా అయిపోవడం మొటిమలతో ఎండకు చర్మం కందిపోవడం వంటి చర్మ సమస్యలు తలెత్తుతాయని డాక్టర్స్ చెపుతున్నారు. తెల్లదనంలోనే అందం ఉందని ప్రచారం చేసే పరిశ్రమలు తప్పించి ఈ క్రీమ్ ల వల్ల చర్మం తెల్లబడకు పోగా పాడవుతుంది అంటున్నారు డాక్టర్స్.

Leave a comment