ఈ ఆసనం తో కండరాలు దృఢం

ఫిట్ నెస్ కోసం నటరాజాసనం చేసి చూపిస్తున్నారు మలైకా అరోరా.ఈ ఆసనం తో తొడ తుంటి భాగంలోని కండరాలు వెన్నుముక కండరాలు దృఢంగా మారుతాయి.ఈ వీడియో లక్షల మంది చూశారు ముందుగా నేలపై నిటారుగా నిల్చోవాలి. పొడవైన కర్రను చేతిలో పట్టుకోవాలి ఇప్పుడు శ్వాస తీసుకొని ఎడమ మోకాలు వెనక్కు వంచాలి.శ్వాస వదులుతూ ఎడమ చేతిలో ఎడమ కాలు పట్టుకుని పైకి లేపాలి ఎడమ పాదం సీలింగ్ వైపు చూస్తున్నట్లు ఉండాలి. మోకాలు తో శరీరంపైన వ్యతిరేక దిశలో వత్తిడి పెంచాలి ఈ భంగిమలో 10,15 సెకండ్లు ఉంటే చాలు కండరాలు దృఢంగా అయిపోతాయి.