నేను ట్రాన్స్ జెండర్ ని అనే కారణంగా నేను ఎన్నో అవమానాలు సహించవలసి వచ్చింది. అవన్నీ సహిస్తూ చదువు పైన ద్రుష్టి పెట్టాను. మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో ప్రాక్టికల్ సెక్షన్ లో ఒక మహిళకు ప్రసవం చేసి ఆ బిడ్డను చేతిలోకి తీసుకొన్న క్షణం నా జీవితంలో ఎంతో విలువైంది అంటోంది డాక్టర్ త్రినేత్ర. కర్నాటక రాష్టంలో మొదటి ట్రాన్స్ ఉమెన్ డాక్టర్ గా త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు గుర్తింపు పొందింది. ఆమె ప్రస్తుతం మణిపాల్ లోని కస్తూర్బా మెడికల్ హాస్పిటల్ లో పనిచేస్తుంది. నాగతం నాకో విషాదం కానీ ఇప్పుడు నేనో డాక్టర్ని అని గర్వాంగా చెపుతోంది త్రినేత్ర. బెంగళూర్ లో త్రినేత్రను ఒకప్పుడు అంగర్ గమ్మరాజు అనేవారు. లింగ మార్పిడి చేయించుకొని అంగర్ తన తల్లి దుర్గ పేరులైన త్రినేత్ర గా పేరు మార్చుకొంది. కుటుంబ సహకారం తోనే డాక్టర్ను అయ్యానంటోంది త్రినేత్ర.

Leave a comment