నెయిల్ పీర్సింగ్స్

అందమైన గోళ్ళకు వట్టి నెయిల్ పాలీష్ రంగులే కాదు అందమైన జ్యూలరీ జోడిస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్లు,గోళ్ళ కోసం చాలా సున్నితమైన అందమైన ఆభరణాలు వస్తున్నాయి.నెయిల్ ఆర్ట్స్ లో కూడా చాలా చక్కని ట్రెండ్స్ వచ్చాయి.గోళ్ళకు వేళాడే ఆభరణాలు,గట్టిగా నొక్కి పెట్టేవి నెయిల్ ఆర్ట్స్ రింగ్స్ చాలానే ఉన్నాయి. వేళ్ళకు ఆభరణలు ధరించడం ఎప్పటినుంచో ఉంది. కొత్తగా ఇప్పుడు గోళ్ళకు పెట్టుకునే బంగారు ఆభరణాలు వచ్చాయి.చక్కని వజ్రాలతో మెరిసిపోయేలా ఉన్నాయి.