నన్ను రేప్ చేశాడు

అమెరికా లోని ప్రముఖ వార్త సంస్థ నేసనల్ పబ్లిక్ రేడియో చీఫ్ బిజినెస్ ఎడిటర్ పల్లవి గోగోయ్ లైంగిక వేధింపుల విషయంలో తన గళం విప్పారు. వాషింగ్టన్ పోస్ట్ లో ఆమె ఒక వ్యాసం రాస్తూ ప్రముఖ సంపాదకుడు ,కేంద్ర మాజీ మంత్రి ఎం.జె అక్బర్ ,23 ఏళ్ళ క్రితం తనను రేప్ చేశారని ఆరోపించింది. ఓ అసైన్ మెంట్ కోసం జైపూర్ వెళ్ళాను అప్పుడు నేను ఏషియన్ ఏజ్ లోనే పనిచేస్తున్నా. అప్పటికే అక్కడ ఉన్న అక్బర్ అ కథనంపై చర్చించేందుకు రూమ్ కు రమ్మన్నడు. అక్కడే నాపై అత్యాచారం చేశారు. ఆ ఘటనతో ఎంతో అవమానానికి గురై కూడా పోలీసులకు చెప్పలేక పోయాను. ఆ సంఘటన తర్వాత ఆయన నాపై ఎంతో హక్కును ప్రదర్శించేవాడు .పెత్తనం చలాయించేవాడు. చివరికి నేను ఉద్యోగం వదిలేసి న్యూయార్క్ లోని డౌజోన్స్ పత్రికలలో చేరాను. ఇప్పుడు నేను యూఎస్ పౌరురాలిని అని చెప్పుకోచ్చారామె.ఎంజె అక్బర్ ఈ విషయం పై స్పందిస్తూ ఆమె అంగీరారంతోనే మా లైంగిక సంబంధం కొనసాగిందన్నారు. అక్బర్ భార్య మల్లిక కూడా దీన్ని సమర్థించారు.