నటన నే నమ్ముకున్న

నేను నటననే నమ్ము కొంటాను అంటుంది సాయి పల్లవి. తన బలం సహజమైన నటనే కానీ గ్లామర్ కాదు అంటుందీ అమ్మాయి. సాధారణంగా హీరోయిన్లు అందరూ గ్లామర్ గా కనిపిస్తారు. అందానికి మార్కులు పడతాయి కూడా నేను అలా కాదు. తనపైన నా కాస్టూమ్స్ కూడా గొప్పగా ఉండాలి. ఫిదా లో సాదాసీదా అమ్మాయిలాగే ఉన్నాను. మేకప్ లేదు గొప్ప డ్రెస్ లు లేవు. తెలుగు ప్రేక్షకులకు నచ్చు తానా లేదా అని సినిమా చేస్తున్నపుడు చాలా భయపడ్డాను. కానీ ప్రేక్షకుల స్పందన చూసి మతిపోయింది. ధియేటర్ లోనే పట్టేశా. ఇదంతా ప్రేక్షకుల గొప్పతనం అంటూ చెప్పుకొచ్చింది సాయి పల్లవి ప్రేక్షకులపైనే ఈ హీరోయిన్ పెట్టుకొన్న నమ్మకం వృధా కానట్లే.