ఈ నేల పైన ఎక్కడ చూసినా శ్రీరాముడు అడుగు పెట్టని నేల, సీతమ్మ చీరలు ఆరేయని చొటు కనిపించదు. భాషలో కుడా రాముడికి అగ్ని పీటమె వుంది. చక్కని  అబ్బాయి పుడితే రామ సేక్కని కుర్రాడని ఏ ఆడపిల్లకు కష్టం  వస్తే ‘ఆ సీతమ్మ కే తప్పలేదని’ కొత్త దంపతులను సీతారాముల్లా కలకాలం వర్దిల్లాలి అని అంటారు. రామదాసు కీర్తనలలో భద్రాద్రి రాముడి భక్త వత్సల్యత అక్షర ధారై కురుస్తుంది. ఎంత మంచి కీర్తనలవి “తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని” అంటాడు. ‘తక్కువేమి మనకు రాముండుడొక్కాడుండు వరకు’ అని సంతోషిస్తాడు. మముబ్రోవమని చెప్పవె అని సీతమ్మ కు సిఫార్సు చేయమంటాడు. ఆ సీతా సమేత రాముడి కళ్యాణం ఇటు బద్రాచలంలో అటువంటి మట్టిలో సీతారాముల కళ్యాణం మహా వైభవంగా జరుగుతుంది. కుడివైపున లక్ష్మణుడు, ఎడమ వైపున శుభ లక్షణమైన జానకి దేవితో ఎదురుగా అన్జనేయుని తో వున్న ఆ రఘునంధనుడు రాముడు ఎక్కడ ఉంటాడో అక్కడ భయం వుండదట. రాముడి కళ్యాణం పావనా చరితుడు, ఆ రాముడు ఈ వసంతం అందరి జీవితాల్లో నవ వసంతం నింపాలని కోరుకుంటూ అందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

‘రామచంద్రాయ జానకీ రాజజా మనోహరాయ

మామాకా భీష్ట దాయ మహిత మంగళం’

Leave a comment