2018 ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు పశ్చిమ కనుమల్లో 12 సంవత్సరాలకు ఒక్కసారి కుదంజి పూలు పూస్తాయి. ఈ కాలంలో ఈ పశ్చిమ కనుమల్లో ఎన్నో రకాల నీలి భయల్లో కుదంజి పూలు విచ్చి కనిపిస్తాయి. వీటిని నీలి కుదంజి అంటారు. మున్నర్ ఈ పూల మొక్కలతో అద్భుతంగా టారిస్ట్ లను ఆకర్షిస్తూ ఉంటాయి. 1300నుంచి 2400మీటర్ల ఎత్తైన పర్వతాలపైన అడుగు నుంచి రెండు అడుగుల ఎత్తుకు మాత్రమే ఎదిగే మొక్క ఇది. ఇది పూల మొక్కలలో 250 వరకు జాతులు ఉన్నాయి. కొన్ని ఏడేళ్ళకు మరి కొన్ని 16 ఏళ్ళకు పూస్తాయి.12 సంవత్సరాలకు ఒక సారి పూసే వాటి రంగులు ఇంకా ప్రత్యేకం. ఒకసారి పుష్పిస్తే ఇక ఆ మొక్క జీవితం అయిపోతుంది. పూవుల విత్తనాలు నేలకు చేరి మొక్కలై తిరిగి పూసేందుకు 12 సంవలత్సరాలు పడుతోంది. అక్టోబర్ చివరి వరకు నేలపైన కనబడే ఒక అద్భుతమైన పూవుల అందాలు చేడవచ్చు.

Leave a comment