నిద్ర సరిగ్గా పోకపోతే ఊబకాయం వస్తుందని డాక్టర్లు చెపుతుంటారు. కానీ ఈ నిద్ర పట్టనివారు రోజు మొత్తం మీద తీసుకోవాలిసిన క్యాలరీల కన్నా 365 క్యాలరీలు ఎక్కువ తీసుకుంటున్నారనీ  వీరిలో క్యాలరీల ఖర్చు తక్కువగా ఉంటుందనీ చెపుతున్నారు. కావలిసిన దాని కన్నా ఎక్కువ ఆహరం తీసుకోవటం లేదా నిద్రపట్టక సమయం గడవక ఎదో ఒక చిరుతిండి తినటం వల్ల  ఊబకాయం   వస్తోందనీ  తేలుతోంది. లండన్ లోని కింగ్ జార్జ్ యూనివర్సిటీ పరిశోధకులు 172 మంది పైన పరిశోధన చేసారు. సరిపడా నిద్ర పోయేవారికి ఒక నియంత్రణ తో కూడిన జీవన పద్ధతి ఉందనీ వారు సరైన వేలకు తినటం నిద్రపోవటం వల్ల  అధికమైన క్యాలరీలు శరీరంలో చేరటం ఖర్చు కాకపోవటం జరగదని నిద్రలేమి చాలా అనర్దాలకు కారణం అవుతుందని పరిశోధకులు తేల్చారు.

Leave a comment