బెర్కిలీ లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ నిపుణులు నిద్ర పైన రెండు దశాబ్దాలుగా అనేక పరిశోధనలు చేసి నిద్ర లేమి, మనకి వచ్చే వ్యాధులకి సంబంధం  వుందని చెప్పుతున్నారు. బాగా తక్కువ నిద్ర పోయే వారి జీవన ప్రమాణం చాలా తక్కువే అంటున్నారు. వయస్సు పెరిగిన వారు ఆరు గంటల కన్నా తక్కువ నిద్ర పొతే గుండె జబ్బు , పక్షవాతం ముప్పు ఉందనీ , అదే పిల్లలు నిద్ర లేమితో బాధ పడుతూ వుంటే వాళ్ళు అబద్దాల కారులు అవ్వుతారని, అదే టీనేజర్లు ఆత్మహత్య ఆలోచనలు చేస్తారని పరిశోధకులు చెప్పుతున్నారు. ఒక్క రోజు నిద్ర లేకపోయినా దాని ప్రభావం శరీరం లోని రోగ నిరోధక శక్తిని  70 శాతం దెబ్బతిస్తుందట కనుక, తినడం, వ్యాయామం వంటి దైనందన చర్యాల్లాగే నిద్ర కుడా ఒక శారీరక అవసరమని హెచ్చరిస్తున్నారు.

Leave a comment