యవ్వనవంతమైన చర్మం ,మెరిసే నిండైన బుగ్గలతో మొహం కళకళలాడి పోవాలి అంటే శక్తినిచ్చే ఆహారం తినాలి . క్రీమ్ లు మసాజ్ లతో ,రసాయనాలతో చేసే ఫేషియల్స్ తో ముఖ సౌందర్యం ఎంత మాత్రం పెరగదు, చర్మ ఆరోగ్యానికి మేలు చేసే మామిడి ,కమలా,బత్తాయి కర్బుజా, దానిమ్మ ,నేరేడు మొదలైన రంగురంగుల పళ్ళు తినాలి . వివిధ ఆకుకూరలు చర్మాన్ని యవ్వనంగా ఉండేలా చేస్తాయి . కాఫీ ,టి లను అవతల పెట్టి మంచినీళ్ళు తాగాలి . పప్పులు ముడి ధాన్యాలతో చేసిన ఆహారం తినాలి . మద్యం ,ధూమపానం వంటి అలవాట్ల తోనే డిప్రెషన్ ,ఆకలి తగ్గిపోవటం ,నిద్రపట్టక పోవటం మొదలైన అనారోగ్యాలు వస్తాయి . ముఖం కాంతిగా ఉండాలంటే ఇలాంటి చెడ్డ అలవాట్లను దూరంగా ఉంచి క్రమశిక్షణ తో కూడిన జీవితాన్ని ఎంపిక చేసుకోవాలి .

Leave a comment