నొప్పులు ఇప్పుడు హాయిగా ఉన్నాయి పాపా

4 సంవత్సరాలు…7 ఎటెమ్ట్స్ ,మిస్ కారేజెస్ అండ్ 16161 ఇంజక్షన్స్ .ఈ కాప్షన్ తో సోషల్ మీడియాలో ఒక పాప ఫోటో ,బుల్లి పాప, ఆ పాప చుట్టు హార్ట్ షేప్ లో ఇంజక్షన్లు పేర్చారు.. ఈ ఫోటో వైరల్ ఎన్నో అవాంతరాల తర్వాత ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఈ పాపను నెటిజన్లు మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. దేశం తెలియదు కానీ తల్లి పేరు పత్రిసియా ,తండ్రి కింబర్లీ. పిల్లలు పుట్టకపోవటంతో ఐ.వి.ఎస్ పద్దతి ఆశ్రయించి నాలుగేళ్ళలో ఏడుసార్లు గర్భం దాల్చేందుకు ప్రయత్నం చేశారు. మూడు అబార్షన్స్ తర్వాత నాలుగోసారి విజయవంతంగా ఈ పాప పుట్టింది. ఈ మొత్తం కాలంలో 16161 ఇంజక్షన్స్ తీసుకొని వాటిని భద్రంగా దాచి పుట్టిన ఈ పాప చుట్టు పేర్చీ ఫేస్ బుక్ ఖాతాలో పెట్టారు.హృదయకారంలో ఉన్న ఈ ఫోటో ఇప్పుడు ట్రెండ్ .పాప పుట్టాక ఇంజక్షన్స్ కూడా అందంగా అయ్యాయని పాప తల్లి ఉద్దేశ్యం కాబోలు.