2015 జనవరి ఒకటి నుంచి 2017 నవంబరు 30వ తేదీ వరకు మొత్తం వెయ్యి 64 రోజుల్లో ఢిల్లీలోని మన విదేశీ మంత్రిత్వశాఖకు 3,328 మంది ఎన్ఆర్ఐ మహిళలు తమ భర్తలు పెట్టే వేధింపుల పై ఫిర్యాదులు,కాల్స్ చేశారని తన నివేదికలో వెల్లడించింది. ఇవన్ని విదేశీల నుంచి ఎన్నారై భార్యల నుంచి అందుతున్నఫిర్యాదులే. రోజుకు సగటున మూడు కన్నా ఎక్కువ కాల్స్‌, ప్రతి ఎనిమిది గంటలకు ఒక ఫిర్యాదు అందుతోందన్నారు. కాల్‌ చేసిన వాళ్లలో ఎక్కువ మంది ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల అమ్మాయిలేనని ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ కోఆపరేషన్‌ అండ్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌’ ఈ వివరాలను వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఈ వరకట్న దురాచారం మూలంగానే ఎక్కవ కట్నం ఇచ్చి పెళ్లిల్లు చేసి విదేశాలకు పంపుతున్న అమ్మాయిల గతి ఇలా అవుతోందని అభిప్రాయపడుతున్నారు. ఇకనైనా ఇలా ఎవరైనా ఎన్నారై సంబంధం కోసం చూస్తున్న వాళ్లు కాస్త ఆలోచించుకోవాలి.

Leave a comment